న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో శాస్త్ర, సాంకేతిక పరిశోధనలను ప్రోత్సహించేలా ఆయా సంస్థలకు వచ్చే గ్రాంట్లపై ఉన్న జీఎస్టీని మినహాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రానికి సూచించారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్లో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎం రిజ్వీతో కలిసి భట్టి హాజరయ్యారు. జీఎస్టీ 18 శాతం శ్లాబు నుంచి 5 శాతంలో మార్చాలని భట్టి విక్రమార్క కోరారు.