ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వినియోగించాలి : భట్టి
ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి బడ్జెట్లో కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి బడ్జెట్లో కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిధుల వ్యయంలో వెనుకబడిన శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయం, వైద్యం, ఇంధనం, పంచాయతీరాజ్ సహా కీలక శాఖల కార్యదర్శులతో వెంటనే సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఆర్థికశాఖలో సంసరణలు అమలు చేయాలని, ఆదాయ వనరుల సమీకరణతోపాటు రుణాల పునర్వ్యవస్థీకరణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా వ్యయ నియంత్రణ పాటిస్తూనే, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా చూడాలన్నా రు. ఆర్థిక నిర్వహణలో అనుభవజ్ఞులైన నిపుణులు, కన్సల్టెంట్ల సలహాలలు తీసుకోవాలని కోరారు. సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన వర్గాలకు చేరేలా పర్యవేక్షణ ఉండాలని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

