హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా, రామగుండంలో సింగరేణి భాగస్వామ్యంతో కొత్త థర్మల్ ప్లాంట్ ని ర్మించనున్నామన్న ప్రభుత్వ ప్రకటనను విద్యు త్తు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్లాంట్‌ను పూర్తిగా టీజీ జెన్కో ద్వారానే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. రామగుండంలో ప్రతిపాదిత ప్లాంట్ నిర్మాణ స్థలాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం సందర్శించా రు. ఆ స్థలంలో సింగరేణి, టీజీ జెన్కో సంయుక్తంగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్లాంట్ ను నిర్మిస్తాయని ప్రకటించారు. దీంతో పవర్‌ప్లాంట్‌ను టీజీ జెన్కో ద్వారానే చేపట్టాలని, సింగరేణి భాగస్వామ్యం అవసరంలేదని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజేఏసీ) శనివారం హైదరాబాద్‌లో ప్రకటన విడుదల చేసింది. జాయింట్ వెంచర్ ప్రతిపాదనలను ఉపసంహరించుకొని కేవలం జెన్కో ద్వారానే ఈ ప్లాంట్‌ను నిర్మించాలని జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు, కో చైర్మన్లు శ్రీధర్, బీసీ రెడ్డి, వైస్చైర్మన్లు డిమాండ్ చేశారు.
అన్ని అనుకూలతలున్నా..
రామగుండంలో 1971లో ‘రామగుండం థర్మల్ స్టేషన్ (ఆర్టీఎస్)’ – బీ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. 50 ఏండ్ల పాటు ఈ ప్లాంట్ సేవలందించింది. జెన్కో ఆధ్వర్యంలో నడిచిన ఈ ప్లాంట్‌ను సాంకేతిక కారణాలతో మూసివేశా రు. ఇక్కడే కొత్త పవర్‌ప్లాంట్‌ను నిర్మించాలని స్థానికులు కొంతకాలంగా కోరుతున్నారు. జెన్ కో వద్దనున్న ఈ 560 ఎకరాల స్థలాన్ని సింగరేణికి కేటాయించి, ఆ సంస్థ ద్వారా ప్లాంట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేసిం ది. దీనిని పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు వ్యతిరేకించారు. భట్టిని కలిసి జెన్కో ద్వారానే చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు. తాజా గా డిప్యూటీ సీఎం జాయింట్ వెంచర్ ప్రతిపాదనను తెరపైకి తేవడంతో విద్యుత్తు జేఏసీ నేత లు వ్యతిరేకిస్తున్నారు. సాంకేతిక నైపుణ్యం, సమర్థులైన ఇంజినీర్లు, థర్మల్, హైడల్ ఉత్పాదక స్టేషన్ల నిర్మాణం, నిర్వహణలో గొప్ప అనుభవమున్న సిబ్బంది సంస్థకున్నారు. అత్యంత సమీపంలోని శ్రీపాదసాగర్ నుంచి 1.89 టీ ఎంసీల నీటిని తీసుకునే వీలుంది. రామగుండంలోనే తగినంత బొగ్గు అందుబాటులో ఉంది. రైల్వే లైన్ సమీపంలోనే ఉంది. ఇన్ని అనుకూలతలున్నప్పుడు సింగరేణి భాగస్వామ్యం అవసరమేంటని ఉద్యోగ సంఘాల నేతల ప్రశ్నిస్తున్నారు.