డిప్యూటీ సీఎం భట్టికి నిరసన సెగ
ఖమ్మం జిల్లా చింతకానిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారకు నిరసన సెగ తగిలింది. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న మహిళలు పెద్దఎత్తున రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
- చింతకానిలో కాన్వాయ్‌ని అడ్డగించిన దళిత మహిళలు
- మూడెకరాల భూమి కేటాయించాలని ఆందోళన
- రోడ్డుపై నుంచి మహిళలను చెదరగొట్టిన పోలీసులు
- ఆందోళనకారులను కలువకుండానే వెళ్లిపోయిన భట్టి
చింతకాని, ఆగస్టు 30 : ఖమ్మం జిల్లా చింతకానిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారకు నిరసన సెగ తగిలింది. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న మహిళలు పెద్దఎత్తున రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ‘దళితులకు మూడెకరాల భూమి’ పథకం కింద రాజకీయాలకతీతంగా చింతకాని గ్రామంలోని దళితకాలనీకి చెందిన 20 మంది లబ్ధిదారులను గుర్తించి తొమ్మిది మందికి భూపంపిణీ చేశారు. ఆ సమయంలో భూములు అమ్మేందుకు రైతులు ముందుకురాకపోవడంతో ఇంకా 11 మందికి భూపంపిణీ నిలిచిపోయింది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మిగిలిన 11 మందికి మూడెకరాల చొప్పున భూమిని కేటాయించాలని దళిత మహిళలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గతంలో 9మంది లబ్ధిదారులకు కేటాయించిన ఆ భూమినైనా 20 మందికి సమానంగా పంచాలని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని చెదరగొట్టడంతో కాన్వాయ్ ముందుకు కదిలింది. ఈ ఘటనతో చింతకానిలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. భట్టి ఆందోళనకారులను కలువకుండానే వెళ్లిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

