పెద్దపల్లి : అక్రమ కట్టడాలపై(Illegal structures) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో మంథని (Manthani) పట్టణంలో పలు అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులి పిస్తున్నారు. హైకోర్ట్ ఆదేశాలతో మున్సిపల్ టాస్క్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నడుమ పట్టణంలో నిర్మించిన పలు అక్రమ కట్టడాలను కూల్చి వేశారు(Demolition).
కూల్చివేతలకు ముందే అక్రమ కట్టడాలకు అధికారులు నోటీసులు అందజేశారు. అలాగే మంథని రెడ్డి సంక్షేమ సేవా సంఘం భవనానికి అనుమతి లేదని మున్సిపల్ కమిషనర్ సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.