కాంగ్రెస్ సర్కార్‌పై అర్చకుల సమరభేరి
రేవంత్ సర్కార్‌పై ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్) పథకం అర్చకులు సమరభేరి మోగించారు. సోమవారం నుంచి జనవరి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అర్చక చైతన్యయాత్ర నిర్వహిస్తామని డీడీఎన్ఎస్ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ తెలిపారు.
- జనవరి 7 వరకు రోజుకో జిల్లాలో యాత్ర
- నేటి నుంచి డీడీఎన్ఎస్ అర్చక చైతన్య యాత్ర
- ధూప, దీప, నైవేద్యం పథకం అర్చకులకు వేతనాన్ని 35 వేలకు పెంచాలని డిమాండ్
- ఉద్యోగ భద్రతే ప్రధాన ఎజెండా..
- డీడీఎన్ఎస్ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కార్‌పై ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్) పథకం అర్చకులు సమరభేరి మోగించారు. సోమవారం నుంచి జనవరి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అర్చక చైతన్యయాత్ర నిర్వహిస్తామని డీడీఎన్ఎస్ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ తెలిపారు. ఈ నెల 22న నిజామాబాద్‌లో ప్రారంభమయ్యే యాత్ర 23న ఆదిలాబాద్, 24న వరంగల్, 26న కరీంనగర్, 27న మహబూబ్‌నగర్, 29న సంగారెడ్డి, జనవరి 2న నల్లగొండ, 5న రంగారెడ్డి, హైదరాబాద్, 6న ఖమ్మం వరకు సాగుతుందని వాసుదేవశర్మ వివరించారు. పది ఉమ్మడి జిల్లాల్లో డీడీఎన్ అర్చకులతో సమావేశం అనంతరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. డీడీఎన్ పథకం అర్చకులకు ప్రభుత్వం కేటాయిస్తున్న గౌరవ వేతనం సరిపోవడంలేదని, దీంతో అర్చకులు దుర్భర జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక దేవాలయాలను డీడీఎన్ పథకం కిందకు తీసుకొచ్చి దేవాలయాల పునరుజ్జీవనానికి కేసీఆర్ కృషిచేశారని, అయితే, రేవంత్ సర్కార్ మాత్రం ఉన్న వాటిని కొనసాగించడానికే చాలా ఇబ్బందులు పడుతున్నదని ధూప, దీప, నైవేద్యం అర్చకులు చెప్తున్నారు. డీడీఎన్ వేతనాలు సరైన సమయానికి రాకపోవడంతో చాలామంది గ్రామీణ ప్రాంత అర్చకులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్యలపై పలుమార్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించినా పెద్దగా స్పందించలేదని, దీంతో సర్కార్‌పై అర్చక సమరభేరి మోగించాల్సి వస్తున్నదని డీడీఎన్ సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఉద్యోగ భద్రతే ప్రధానం
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2007లో ధూప, దీప, నైవేద్య పథకం ద్వారా రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు పునరుజ్జీవం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్.. ఈ పథకాన్ని మరింత విస్తృతపరిచి ఆలయాల్లో నిర్వహించే ధూప, దీప, నైవేద్యాలు కుంటుపడకుండా వారికి కావలసిన స్థాయిలో వేతనాలు అందించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,758 మంది అర్చకులు ఈ పథకం కింద విధులు నిర్వర్తిస్తున్నారు. డీడీఎన్ పథకం కింద ప్రతి ఆలయానికి రూ.10 వేల చొప్పున గౌరవవేతనం కింద ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అనేక దేవాలయాల్లో అర్చకత్వాన్ని నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నప్పటికీ తాము చేస్తున్న అర్చక వృత్తిపై భద్రత లేకపోవడంతో అర్చక కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడు తమకు జీతాలు వస్తాయో తెలియక వారి జీవనం అగమ్యగోచరంగా మారింది. దేవునికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించే క్రమంలో వేతనాలు వచ్చినా రాకపోయినా తమ బాధ్యతగా సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు. డీడీఎన్ అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారి జీవనం కోసం సరైన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని దౌలతాబాద్ వాసుదేవశర్మ డిమాండ్ చేశారు.
డీడీఎస్ఎస్ సంఘం డిమాండ్స్
- ధూప, దీప, నైవేద్య పథకం కింద ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.35 వేలకు పెంచి ప్రతి నెలా 5వ తేదీలోపు చెల్లించాలి. డీడీఎన్ అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
- హెల్త్‌కార్డులు, ఈహెచ్ఎస్, గుర్తింపుకార్డులు ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలను డీడీఎన్ అర్చకులకు వర్తింపజేయాలి.
- అర్చకులకు పునఃశ్చరణ తరగతులను నిర్వహించాలి. అర్చక సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి.
- హైదరాబాద్ బర్కత్‌పురలో ఉన్న అర్చక భవన్‌కు మరమ్మత్తులు చేయించి డీడీఎన్ అర్చకులకు కేటాయించాలి. ప్రతి జిల్లాలో అర్చక భవన్ ఏర్పాటుచేయాలి.
- ప్రతి జిల్లాలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి అందులో ఇద్దరు డీడీఎన్ అర్చకులకు స్థానం కల్పించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

