హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎంటెక్/ఎంఈ, ఎంఆర్క్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తిచూపించారు.
రెండో విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 5,529 సీట్లుంటే, 419 సీట్లు మిగిలాయి. అంటే 5,110 (92%)సీట్లు భర్తీ అయ్యాయన్నమాట.