BRS | నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ నిలదీత.. సర్కార్ దాటవేత..
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్ ప్రకటన, ఇతర న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ నేతలు బుధవారం అసెంబ్లీలో నిలదీశారు.
- నిరుద్యోగుల సమస్యలపై చర్చకు డిమాండ్
- కేటీఆర్ వాయిదా తీర్మానం.. స్పీకర్ తిరస్కరణ
- ప్లకార్డులతో గులాబీ నేతల నిరసన.. తీర్మానంపై పట్టు
- సర్కార్ నుంచి సమాధానం రాకపోవడంతో టీ బ్రేక్ ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
BRS | హైదరాబాద్, జూలై24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్ ప్రకటన, ఇతర న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ నేతలు బుధవారం అసెంబ్లీలో నిలదీశారు. ఆయా అంశాలపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు తీర్మానాన్ని అందజేశారు. వర్షాలు, గోదావరి వరదలపైనా చర్చించాలని వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా వాటిని స్పీకర్ తిరస్కరించారు.
దీంతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అనిల్‌జాదవ్, సంజయ్, మల్లారెడ్డితోపాటు, ఇతర శాసనసభ్యులు ఒక్కసారిగా లేచి నిరసన తెలిపారు. ‘నిరుద్యోగులపై పోలీసుల దమనకాండ నశించాలి’, ‘మెగా డీఎస్సీ ప్రకటించాలి’, ‘నిరుద్యోగులపై లాఠీచార్జికి క్షమాపణలు చెప్పాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
బీఆర్ఎస్ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానంపై పట్టుబట్టి నిరసన తెలుపుతున్న క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ సభకు టీ బ్రేక్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి మీడియా పాయింట్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. అనంతరం మీడియా వద్ద మాట్లాడారు. నిరుద్యోగుల అంశాలపై శాసనమండలిలో సైతం ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తిరస్కరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

