వెంటనే బీసీ జనగణన చేపట్టాలి

- తెలంగాణ, ఏపీ బీసీ సంఘాల డిమాండ్
- ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): వచ్చే జనగణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా మరే ఇతర కులాల జనాభాను లెక్కించబోమంటూ ఇటీవల పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చేసిన ప్రకటనను నిరసిస్తూ బీసీ సంఘాలు శనివారం ఆందోళన చేపట్టాయి. ఢిల్లీలో జరిగిన ఈ నిరసనలో తెలంగాణ, ఏపీ బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
కులాలవారీగా జనగణన చేయాలి
దేశంలో వెంటనే కులాలవారీగా బీసీల జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా దేశంలోని అన్ని పార్టీలు బీసీల గణన విషయంలో కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. బీసీల జనగణన కోసం అన్ని ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల నేతల్ని కలిసి మద్దతు కూడగడతామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన బీసీ సంఘాల నేతలు కుమ్మర క్రాంతి కుమార్, కనకాల శ్యామ్కుర్మా, రాచాల యుగేందర్‌గౌడ్, కులచర్ల శ్రీనివాస్‌ముదిరాజ్, తాటికొండ విక్రంగౌడ్, శేఖర్ సగర, రావులకొల్ నరేశ్, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, పీ రంగనాథ్, పానుగంటి విజయ్, మూర్తి, సాయితేజ, సతీశ్, సత్యం సగర తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- bc casts
- bc category
- Casts
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

