హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : రేషన్ బియ్యం సరఫరాలో గందరగోళం నెలకొన్నది. రేషన్ షాపులకు తగినన్ని బియ్యం సరఫరా చేయడంలో అధికారులు విఫలమవుతున్నా రు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బియ్యం పంపిణీలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రతి జిల్లాల్లోనూ 15-20% బియ్యం తక్కువగా వచ్చినట్టు తెలిసిం ది. ఈ నెల 15వ తేదీ వరకు ఇంకా 20 లక్షల కార్డుదారులకు బియ్యం అం దలేదు. రేషన్‌షాపుల్లో బియ్యం నిల్వ లు నిండుకోవడంతో లబ్ధిదారులు షాపుల చుట్టూ తిరుగుతున్నారు.
వాస్తవానికి ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వరకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తారు. ఈ నెల పూర్తి స్థాయిలో బియ్యం సరఫరా కాకపోవడంతో ఈ నెల 17 వర కు పంపిణీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 91 లక్షల రేషన్‌కార్డులున్నా యి. ఈ నెలలో ఇప్పటివరకు 70.79 లక్షల కార్డులకు బియ్యం పంపిణీ చేశారు. ఇంకా 20.21 లక్షల కార్డులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉన్నది. సన్న బియ్యం అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం సమయానికి బియ్యం అందడం లేదు.