హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చెంజ్ ఆఫ్ తెలంగాణ(డీట్), శ్రీచైతన్య విద్యా సం స్థలు సంయుక్తాధ్వర్యంలో ఈనెల 9న యూసుఫ్‌గూడలో శ్రీచైతన్య స్కూల్ క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్టు డీట్ అధికారులు ప్రకటనలో తెలిపారు.
శ్రీ చైత న్య విద్యా సంస్థల్లోని వివిధ శాఖల్లో ప్రిన్సిపాల్, లెక్చరర్ తదితర 33 క్యాటగిరీల్లో 500కుపైగా ఖాళీలు భర్తీ చేయనున్నట్టు వా రు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు డీట్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
బీసీ స్టడీసర్కిల్‌లో బ్యాంకింగ్ పరీక్షలకు కోచింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రంగాల్లోని ఉద్యోగాలకు ఫౌండేషన్ కోర్స్‌ను ఉచితంగా అందివ్వనున్నారు. 9వ తేదీలోగా www.tgbcstudycircle.cgg.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ అధికారులు సూచించారు.
రిజర్వేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ మారుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వివరించారు. కోచింగ్ సమయంలో రూ.1,500 ఉపకారవేతనం అందిస్తారని తెలిపారు.