DDMS | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ (డీడీఎంఎస్ కోఫేమ్) లో వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల చైర్ పర్సన్ డాక్టర్ వై. రమాప్రభ, సెక్రటరీ భవాణి, ప్రిన్సిపల్ కె. విజయ తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఈ కోర్సులను అందించనున్నట్లు చెప్పారు. బీఏ కర్ణాటక సంగీతం (ఫుల్ టైం), ఎంఏ కర్ణాటక సంగీతం (పార్ట్ టైం ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్) కోర్సులలో చేరేందుకు కేవలం మహిళలే అర్హులని పేర్కొన్నారు. కర్ణాటక వోకల్లో ఒక సంవత్సరం బ్రిడ్జి కోర్సు, డివోషనల్ మ్యూజిక్ (సంకీర్తన)లో ఆరు వారాల సర్టిఫికెట్ కోర్సు, వీణ, వయోలిన్, కీబోర్డ్, ప్లూట్లలో ఒక సంవత్సరం సర్టిఫికెట్ కోర్సు, సౌందర్య లహరి, క్లాసికల్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్, ఫోక్ డాన్స్, ఆర్జే, వాయిస్ ఓవర్, యాక్టింగ్, యాంకరింగ్, న్యూస్ రీడింగ్, రిపోర్టింగ్, ఎడిటింగ్, డబ్బింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో సర్టిఫికెట్ కోర్సు, టెక్చర్ ఆర్ట్, రెసిన్ ఆర్ట్, లిప్పన్ ఆర్ట్, క్యాండిల్ మేకింగ్, తంజావూర్ పెయింటింగ్, కార్టూనింగ్, డాల్స్ మేకింగ్, క్రోచెట్, స్టోరీ టెల్లింగ్ విత్ ఫ్లాష్ కార్డ్స్, బ్యూటీషియన్, హెయిర్ స్టైల్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తదితర అంశాల్లో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ అన్ని కోర్సుల్లో చేరేందుకు మహిళలతో పాటు పురుషులు కూడా అర్హులని వివరించారు. అర్హులైన వారు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు 9441768811, 9393949415 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.