పెద్దపల్లి : గోదావరిఖని(Godavarikhani)లో డీసీఎం వ్యాన్(DCM van) బీభత్సం(Havoc) సృష్టించింది. అదుపుతప్పి పలు వాహనాలపై దూసుకెళ్లడంతో బైక్లు ధ్వంసమయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం..ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదుట రాజీవ్ రహదారిపై మంచిర్యాల వెళ్తున్న డీసీఎం రోడ్డు, హోటళ్ల పక్కన పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా ఒక సైక్లిస్ట్కు స్వల్పగాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.