మియాపూర్, మార్చి 5: అపస్మారకస్థితిలో దవాఖానలో చికిత్స పొందుతున్న సినీగాయ ని కల్పన కూతురు దయ స్పందించారు. తన తల్లిది ఆత్మహత్యాయత్నం కాదని చెప్పారు. కేవలం నిద్రమాత్రలు మోతాదుకు మించి వే సుకోవడం వల్లే అపస్మారకస్థితిలోకి చేరుకుందని చెప్పారు. బుధవారం హైదర్‌నగర్ హోలిస్టిక్ హాస్పిటల్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ తన తల్లికి నిద్రలేమి సమస్య ఉన్నదని తెలిపారు. ఇందుకోసం మాత్రలు వాడుతున్నట్టు వెల్లడించారు. ఓవర్‌డోస్ తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వివరించారు. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. తమ కుటుంబం లో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టంచేశారు.