పాస్‌పోర్టులు సకాలంలో పునరుద్ధరించుకోవాలి

- రీజినల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ప్రయాణికులు గడువులోగా పాస్‌పోర్టులు పునరుద్ధరించుకోవాలని రీజినల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య శుక్రవారం పలు మార్గదర్శకాలను విడుదల చేశారు. గడువు ముగియకముందే పునరుద్ధరణ తప్పనిసరని, దరఖాస్తుదారులందరూ అధికారిక పోర్టల్ www.passportindia. gov.in ను మాత్రమే ఉపయోగించుకోవాలని కోరారు. ప్రత్యామ్నాయంగా అధికారిక మొబైల్ యాప్ mPassport ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ స్టోర్లనుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మూడు, నిజామాబాద్‌లోని ఒక పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (PSK), కరీంనగర్‌లోని పాస్‌పోర్టు సేవా లఘు కేంద్రం (PSLK), రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవాకేంద్రాల్లో (POPSK) పాస్‌పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మధ్యవర్తులకు ఎక్కువ డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించారు. org, .in, .com పేర్లతో ఉన్న ఫేక్ వెబ్సైట్ల లింకులను ఓపెన్ చేయరాదని సూచించారు. సందేహాలుంటే నేషనల్ కాల్‌సెంటర్ 1800-258-1800లో సంప్రదించాలని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ దాసరి బాలయ్య సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

