డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు
ఎల్లూరి శివారెడ్డి | తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు వరించింది. 2021 సంవత్సరానికిగాను

హైదరాబాద్ : తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు వరించింది. 2021 సంవత్సరానికిగాను ఈ అవార్డుకు ఎల్లూరి శివారెడ్డి ఎంపికయ్యారు. దాశరథి జయంతి సందర్భంగా ఎల్లూరి శివారెడ్డికి రేపు అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డుతో పాటు 1,01,116 నగదును అందజేయనున్నారు.
సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన వారిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రతి ఏడాది దాశరథి జయంతి(జులై 22) రోజున ఆ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ అవార్డు ప్రదానం 2015 సంవత్సరం నుంచి కొనసాగుతోంది. తెలుగు సాహిత్యంలో విశిష్ఠ స్థానం సంపాదించిన దాశరథి కృష్ణమాచార్య.. 1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు.
2015లో తొలి దాశరథి సాహితీ పురస్కారాన్ని కవి ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్యకు ప్రదానం చేశారు. 2016లో జే బాపురెడ్డికి, 2017లో ఆచార్య ఎన్ గోపికి, 2018లో వఝల శివకుమార్‌కు, 2019లో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు, 2020లో డాక్టర్ తిరునగరి రామానుజయ్యకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు వరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

