
హుజురాబాద్, ఆగస్టు 23 : ఈటల రాజేందర్ రాజీనామా వల్లే హుజూరాబాద్‌కు చెందిన బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చిందన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు సిగ్గుచేటని దళిత సంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దళి త సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. బండ శ్రీనివాస్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేసున్నారన్నారు. ఆయన కంటే పార్టీలో ఈటల రాజేందరే జూనియర్ అని గుర్తుచేశారు. టీఆర్ఎస్కు, ప్రజలకు చేసిన సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ ఆయనకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. సమావేశంలో దళిత నాయకులు కనుమల్ల గణపతి, ప్రభాకర్, శ్రీనివాస్, పోచంపల్లి సదయ్య, కనకం రాజ్‌కుమార్, మొగిలి తదితరులు పాల్గొన్నారు.