దళిత బంధు కొత్త పథకం కాదు : వినోద్ కుమార్
వినోద్ కుమార్ | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘దళిత బంధు’ పథకం ఆరు నెలల క్రితమే రూపుదిద్దుకున్నదని, ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘దళిత బంధు’ పథకం ఆరు నెలల క్రితమే రూపుదిద్దుకున్నదని, ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం రవీంద్రభారతిలో సాంస్కృతిక సారథి కళాకారుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ గత కొంత కాలంగా వ్యూహ రచన చేస్తున్నారని అన్నారు. దళితుల విస్తృత ఆర్థిక, సామాజిక ప్రయోజనం కోసం సీఎం కేసీఆర్ పరితపించి దళిత బంధు పథకాన్ని రూపకల్పన చేశారని ఆయన గుర్తు చేశారు.
గత ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళిత ఎంపవర్మెంట్ కోసం రూ. 1,000 కోట్లు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించినట్లే అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో దళితుల అభ్యున్నతి కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారని ఆయన గుర్తు చేశారు.
కొత్తగా పుట్టుకొచ్చిన పథకం కాదు ఇది. అందునా రాజకీయ కోణం ఇందులో ఏమీ లేదు. కేవలం దళితుల అభ్యున్నతిని కాంక్షించే ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు వినోద్ కుమార్ వివరించారు.
అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత కొవిడ్ మహమ్మారి ప్రభావం చూపడం వల్ల ఈ పథకం అమలులో జాప్యం జరిగిందని ఆయన తెలిపారు.
రైతు బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో లాంఛనంగా ప్రారంభించినట్లే.. దళిత బంధు పథకాన్ని కూడా హుజురాబాద్ నుంచే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తీసుకున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఇందులో ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం లేదని , వాస్తవాలను ప్రతి ఒక్కరూ గమనించి మెలగాలని ఆయన సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పోషించిన పాత్ర మరిచిపోలేదని, స్వరాష్ట్రం సిద్దించగానే సాంస్కృతిక సారథి సంస్థ ద్వారా కళాకారులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
సాంస్కృతిక సారథి కళాకారులు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారాన్ని కల్పించాలని, ఈ గురుతర బాధ్యత కళాకారుల భుజ స్కంధాలపై ఉందని ఆయన చెప్పారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి సంస్థ చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ, ప్రముఖ ప్రజాకవి గోరటి వెంకన్న, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి.
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి
వెలుగులోకి మరో పోర్న్ రాకెట్ ..కటకటాల వెనక్కి వర్ధమాన నటి
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

