బాలీవుడ్ నాట పోర్నోగ్రఫీ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారం నడుపుతూ పోలీసులకి పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు మరో పోర్న్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. వర్దమాన నటి నందితా దత్తా(30) సినిమాల అవకాశాలు లేకపోవడంతో సెమీ పోర్నోగ్రఫిక్ కంటెంట్ సినిమాల్లో నాన్సీ భాబీ పేరిట నటిస్తూ డబ్బులు సంపాదిస్తుంది.
మోడల్స్‌ని సైతం ఈ రంగంలోకి రాబట్టేందుకు వెబ్ సిరీస్‌లని ఎరగా చూపెడుతుంది. ఈ మేరకు ఇద్దరు బాధితురాళ్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు డమ్ డమ్, నక్‌టాలాలోని కొన్ని ఇళ్లలో శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపారు. నక్‌టాలాలో ఓ మోడల్ని నగ్నంగా ఫొటో షూట్ చేస్తున్న సమయంలో నందితాను అడ్డుకొని అరెస్ట్ చేశారు. డమ్ డమ్లోని మరో ఇంట్లో ఆమె అనుచరుడు మైనక్ నేతృత్వంలో పోర్న్ షూటింగ్ జరుపుతుండగా, దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
తన మాట వినకుంటే నందితా తన మనుషులతో చంపిస్తామని బెదిరిస్తుందని మోడల్స్ కంప్లైంట్ చేయడంతో మోడల్ కమ్ నటిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా దొరకబట్టి.. అరెస్ట్ చేశారు పోలీసులు. బాలీగుంజేలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో తనపై అఘాయిత్యం జరిగిందని పేర్కొంటూ ఈ మేరకు జులై 26న న్యూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయింది. దీనిలో నందిత హస్తం ఉందా అని పోలీసులు ఆరాలు తీస్తున్నారు.