హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): షాద్‌నగర్‌లో దళిత మహిళను కొట్టిన ఘటనపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సీరియస్ అయ్యారు. ఘటనపై షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామిని విచారణాధికారిగా నియమించి ఒక్కరోజులోనే విచారణ జరిపించారు. మహిళను విచక్షణారహితంగా కొట్టినట్టు నివేదిక సమర్పించడంతో వెంటనే స్పందించిన సీపీ మహంతి చర్యలు చేపట్టారు. డీఐ రామిరెడ్డి, కానిస్టేబుళ్లు జాకీర్, మోహన్‌లాల్, రాజు, అఖిల్, కరుణాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.ఘటనపై బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తామన్నారు.
సూర్యాపేటలో ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
సూర్యాపేట టౌన్, ఆగస్టు 5: ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సూర్యాపేటలోని ముగ్గురు కానిస్టేబుళ్లను ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడిన సూర్యాపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఎం రాంబాబు, ఎం బాలకృష్ణ, ఎల్ పూర్ణచందర్‌పై చర్యలు తీసుకున్నారు.