మెట్రో రైళ్లకు ఆగిన కరెంట్
హైదరాబాద్‌లో బుధవారం కురిసిన భారీ వర్షానికి మెట్రో మార్గాల్లో కొద్దిసేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
- రైళ్ల తలుపులు బంద్, తెరుచుకోని స్టేషన్ల గేట్లు
- ప్రయాణికుల భయాందోళన
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో బుధవారం కురిసిన భారీ వర్షానికి మెట్రో మార్గాల్లో కొద్దిసేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్ వద్ద ఉన్న ట్రాన్స్‌కో ఫీడర్‌కు విద్యుత్తు సరఫరా ట్రిప్ కావడంతో ఏడు నిమిషాలపాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఎల్బీనగర్ – మియాపూర్ మార్గంలో నడిచే మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయా యి. ఓ వైపు రైళ్లలో తలుపులు తెరుచుకోకపోగా.. మరో వైపు మెట్రో స్టేషన్లలో గేట్లు సై తం మూతపడ్డాయి. పావుగంట పాటు ప్రయాణికులు అటు రైళ్లలో, ఇటు స్టేషన్ల వద్ద భయాందోళనకు గురయ్యారు.
ఎర్రమంజిల్‌లో మెట్రో రైలు తలుపులు 15-20 నిమిషాల పాటు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులు బయటకు వచ్చారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో ఎగ్జిట్ గేట్లు తెరుచుకోలేదు. ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగా రు. వెంటనే మియాపూర్‌లోని ఫీడర్ నుంచి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించి రైళ్లను నడిపామని మెట్రోఅధికారులు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

