కాంగ్రెస్ మీటింగ్‌కూ కరెంట్ కట్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పార్టీ నేతలు షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో తరచూ కరెంట్ పోవడంతో నాయకులు, కార్యకర్తలు విసుగుచెందారు.
- తరచూ అంతరాయం.. చీకట్లోనే మాట్లాడిన షబ్బీర్ అలీ
కంఠేశ్వర్/మాచారెడ్డి, జూన్ 20: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పార్టీ నేతలు షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో తరచూ కరెంట్ పోవడంతో నాయకులు, కార్యకర్తలు విసుగుచెందారు. షబ్బీర్ అలీ మాట్లాడుతుండగా రెండుసార్లు కరెంట్ పోయింది. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని, బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు.
పదెకరాల లోపు వారికే రైతుబంధు!
పదెకరాల లోపు భూమి ఉన్న వారికి, అది కూడా సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతుభరోసా అందించాలని మాచారెడ్డి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో చేసిన ఈ తీర్మానం చర్చనీయాంశమైంది. మాచారెడ్డి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ నర్సింగ్‌రావు అధ్యక్షతన గురువారం జరిగింది.
ముఖ్యఅతిథిగా షబ్బీర్‌అలీ హాజరుకాగా, రైతుభరోసాను పదెకరాల లోపు రైతులకే పరిమితం చేయాలని, అది కూడా పంటలు పండించే వారికే ఇవ్వాలని తీర్మానం చేశారు. తీర్మాన ప్రతిని షబ్బీర్అలీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుభరోసాపై రాష్ట్రంలోనే మొదటిసారి ఈ విధంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన మండల పరిషత్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

