IAS Srilakshmi | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం కోసం ఆమె ఫైల్ తెచ్చారు.
సంతకం పెట్టేందుకు మంత్రి నిరాకరించి, ఫైల్‌ను తిప్పిపంపారు. ఇప్పుడు సమయం కాదం టూ తిరస్కరించారు. రెండు రోజుల క్రిత మే శ్రీలక్ష్మిని సీఎం చంద్రబాబు తన పేషీ నుంచి బయటకు పంపారు. పుష్పగుచ్ఛం తీసుకోకుండా నిరాకరించారు.