హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : సీపీఎస్ ఉద్యోగుల సొమ్ములను సర్కార్ దారి మళ్లిస్తున్నదని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ దర్శన్గౌడ్ ఆరోపించారు. ఉద్యోగి నుంచి వసూలు చేసిన 10%, ప్రభుత్వం చెల్లించాల్సిన 10% మ్యాచింగ్ గ్రాంట్ ప్రాన్ ఖాతాల్లో జమకావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నెలల తరబడి ఇలాగే జరుగుతుండటం గర్హనీయమని వాపోయారు.
2023 నుంచి 13 నెలల సొమ్ములను దారి మళ్లించారని మండిపడ్డారు. దీంతో సీపీఎస్ ఉద్యోగులు 6వేల కోట్లు నష్టపోయారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే వడ్డీతో సహా ఆయా మొత్తాన్ని ప్రాన్ ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు.