రాజగోపాల్.. ఓ దొంగ!
రాజగోపాల్‌రెడ్డి ఓ దొంగ అని, ఆ విషయా న్ని ఆయనే బహిరంగంగా చెప్పారని సీపీఎం నేత, మాజీ ఎమ్మె ల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ వద్ద మునుగోడు ప్రజలను రూ.18 వేల కోట్లకు తాకట్టు పెట్టారని విమర్శించారు.
- 18 వేల కోట్లకు మునుగోడు తాకట్టు
- కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం నల్లేరుపై నడకే
- సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాజగోపాల్‌రెడ్డి ఓ దొంగ అని, ఆ విషయా న్ని ఆయనే బహిరంగంగా చెప్పారని సీపీఎం నేత, మాజీ ఎమ్మె ల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ వద్ద మునుగోడు ప్రజలను రూ.18 వేల కోట్లకు తాకట్టు పెట్టారని విమర్శించారు. అలాంటి రాజగోపాల్ కమ్యూనిస్టుల గురించి మాట్లాడటం దయ్యా లు వేదాలు వల్లించినట్టే ఉన్నదని ఎద్దేవాచేశారు. అభివృద్ధి చేస్తాడనే ప్రజలు అసెంబ్లీకి పంపారని, అక్కడ మాట్లాడకుండా బీజేపీలో చేరి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
ఒకసారి గెలిచి ఏమీ చేయలేని ఆయన మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తాడని ప్రశ్నించారు. దేశంలో మత మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ అసలైన సిద్ధాంతమని, అటువంటి పార్టీలో రాజగోపాల్ చేరి, ఆ పాపంలో భాగస్వామి అయ్యాడన్నారు. ఎనిమిదేండ్ల లో తెలంగాణకు ఏమీ చెయ్యని బీజేపీ, ఇప్పుడు ము నుగోడుకు ఏం చేస్తదని ప్రశ్నించారు. విభజన హామీల్లో ఒక్కటైనా బీజేపీ నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. రాజగోపాల్ వంటి వాళ్లు సమాజానికే చేటని, తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడులో సీపీఐ, సీపీఎం బలపరుస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం నల్లేరుపై నడకేనని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

