హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజగోపాల్‌రెడ్డి లబ్ధి కోసం, బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసమే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలతో అనవసరంగా తీసుకొచ్చిన ఎన్నిక అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేసినట్టు రాజగోపాల్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, ఇది నూరుపాళ్లు అవాస్తవమని పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డికి ఘోర పరాజయం తప్పదన్నారు. ఇంతకాలం మునుగోడు అభివృద్ధిని పట్టించుకోని బీజేపీ.. గెలిచి సాధించేదేమీలేదని స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎంలు బలపరుస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయమని తెలిపారు.