మోదీ, అమిత్ షా, నడ్డాలపై కేసులు బుక్ చేయాలి.. కూనంనేని డిమాండ్
kunamneni sambashivarao | తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహరంలో సీఎం కేసీఆర్ బయట పెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ
హైదరాబాద్ : తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహరంలో సీఎం కేసీఆర్ బయట పెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీఎల్ సంతోష్‌లపై కేసులు నమోదు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఎనిమిది రాష్ట్రాలలో ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చివేయడంలో తమ పాత్ర ఉన్నదని, అలాగే ప్రధాని, కేంద్ర హోంమంత్రిల పాత్ర ఉన్నదని వీడియోలో మఠాధిపతులు పదే పదే చెప్పడాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ వీడియోల ఆధారంగా ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టడానికి జరిగిన కుట్రపై ఆయా రాష్ట్రాల హైకోర్టులు సూమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే ఈ వీడియోలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, అన్ని రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులకు పంపినట్లు సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో పెద్దవారైనా, చిన్న వారైనా చట్టం ముందు అందరూ సమానమనని న్యాయవ్యవస్థ సంకేతాలివ్వాలని కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక ఉన్న అందరిపై కేసులు పెట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని కూనంనేని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

