హైదరాబాద్, జూలై 18 (నమ స్తే తెలంగాణ): జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఒక దళారి అని, టీడీపీ, బీజేపీ మధ్య అనుసంధానానికి ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కా ర్యదర్శి నారాయణ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే మిత్రపక్ష కూటమి సమావేశానికి ఆయన హాజరవ్వడం బాధాకరమని, ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చి ఇప్పుడు ఎన్డీయేలో ఎలా చేరుతున్నాడో చెప్పాలని ప్రశ్నించారు.
అసలు ప్రత్యేక హోదాయే ఇవ్వని బీజేపీతో ఎలా అంటకాగుతాడని నిలదీశారు. బీజేపీతో కలవడం లౌకికవాదానికి ప్రమాదకరమని హెచ్చరించారు. నిన్నటివరకు చెగువేరా దుస్తులు వేసుకొని, ఇప్పుడు సావర్కర్ దుస్తులు వేసుకునేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకునేందుకు సిద్ధమవుతాడని ఆరోపించారు. పవన్ కదలకుండా 3 నిమిషాలు మాట్లాడగలిగితే.. ఆ తర్వాత ఆయన రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చని ఎద్దేవా చేశారు.