హైదరాబాద్,ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): అక్రమ వలసదారుల పేరు తో ట్రంప్ అవలంబిస్తున్న చర్యలు ఆక్షేపణీయమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. ట్రం ప్ ప్రభుత్వం వలసదారులను తిప్పిపంపే క్రమంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం అమెరికా పార్లమెం ట్ ముందు నుంచి ఆయన ఒక వీడి యో విడుదల చేశారు. అక్రమ వలసదారులను పంపడాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. కానీ ట్రంప్ ఎన్నుకున్న విధానం సరిగా లేదని విమర్శించారు. ట్రంప్ చర్యలతో యువత జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని పేర్కొన్నారు. వలసదారులకు కొంత సమ యం ఇచ్చి… సుహృద్భావ వాతావరణంలో తిప్పిపంపే విధంగా చర్యలు చేపట్టాలని నారాయణ కోరారు.