సీఎం కేసీఆర్ 80 వేలకుపైగా ఉద్యోగాలు ప్రకటించటం, వయోపరిమితిని పెంచటాన్ని స్వాగతిస్తున్నాం. 11,013 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్టు ప్రకటించడం హర్షణీయం. ఇకపై కాంట్రాక్టు విధానం ఉండబోదని చెప్పిన సీఎం, వివిధ శాఖల్లో కోర్టుకు వెళ్లకుండా ఉన్న ఉద్యోగుల విషయంలోనూ సానుకూల ప్రకటన చేయాలి. రాష్ట్ర పునర్విభజన చట్టం షెడ్యూల్ 8, 9లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల విభజనపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని పార్టీల సహకారం తీసుకోవాలి.
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
త్వరితగతిన భర్తీ చేయాలి
ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రకటించిన పోస్టులన్నింటినీ త్వరితగతిన భర్తీ చేయాలి.
– తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి