హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ : పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగెట్ ప్రాథమిక కీ విడుదలయ్యింది. మొత్తం 32 సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక కీలను https://cpget.tgche.ac.in. వెబ్సైట్లో పొందుపరిచినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. అభ్యర్థులు మంగళవారం నుంచి ఈ నెల 21 వరకు అభ్యంతరాలు వ్యక్తంచేయవచ్చని సూచించారు.
ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము చెల్లించి ఆన్లైన్లో ఈ నెల 21వ తేదీ ఉదయం 11గంటల్లోపు తమ అభ్యంతరాలను వెల్లడించాలని సూచించారు. అభ్యంతరం సరైనది అయితే ఆ సొమ్మును తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. 6 నుంచి 11 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 45,477 మంది హాజరైనట్టు ఆయన వెల్లడించారు.