CPGET | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) హాల్టికెట్లు ఆదివారం విడుదల కానున్నాయి. ఈ నెల 30 నుంచి జూలై 10 వరకు నిర్వహించే సీపీగెట్ పరీక్షల హాల్టికెట్లను https://cpget.tsche.ac.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సూచించారు. ఈ ఏడాది సీపీగెట్కు 69,498 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. రెండు సెషన్లలోను పరీక్షలు జరుగుతాయి.