హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కొవిడ్‌ను కొవాగ్జిన్ టీకా సమర్థంగా నియంత్రిస్తుందని అమెరికా క్లినికల్ ట్రయల్స్‌లోనూ తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది. అమెరికాలో కొవాగ్జిన్‌ను సరఫరా చేస్తున్న ‘ఆక్యుజెన్’ సంస్థ నిర్వహించిన ఫేజ్-2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌లో తమకు సానుకూల ఫలితాలు వచ్చినట్టు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.