నాంపల్లి కోర్టులు, మే 12 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఆరుగురికి షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు శు క్రవారం మంజూరు చేసింది. కేతావత్ రాజేశ్వర్, కేతావత్ నీలేశ్‌నాయక్, కేతావత్ శ్రీనివాస్, కేతావత్ రాజేందర్, షమీమ్, నల్లగోపుల సురేశ్‌కు బెయిల్ లభించింది. వీరంతా పాస్‌పోర్టు కోర్టుకు సమర్పించాలని, విచారణకు సహకరించాలని ఉత్తర్వులో ఆదేశించింది.
నీలేశ్‌నాయక్, రాజేందర్‌కు 25 వేల పూచీకత్తుతో ఇద్దరి జమానత్‌లు, మిగిలినవారు 50 వేలు, ఇద్దరి జమానత్‌లు సమర్పించాలని తెలిపింది. కాంతం మురళీధర్‌రెడ్డి, ఆకుల మనోజ్‌కుమార్, ఆది సాయిబాబు, పొన్నం వరుణ్‌కుమార్, రమావత్ మహేశ్, ముదావత్ శివకుమార్‌ను ఐదు రోజులకు కస్టడీకి అప్పగించాలని సిట్ పోలీసులు శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.