హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తేతెలంగాణ): మార్కెట్లో అమ్ముతున్న నకిలీ న్యూట్రిషన్ ట్యాబ్లెట్లను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. కుత్బుల్లాపూర్‌లోని బషీరాబాద్‌లో ఉన్న శ్రీ బ్లూటెన్ ఫార్మసీలో తనిఖీలు చేయగా ‘విటెన్సీ క్యాప్సూల్స్’ లభ్యమయ్యాయని చెప్పారు. వీటిని హైదరాబాద్ మలక్‌పేటలోని యాక్సెంటిక్ హెల్త్‌కేర్ సంస్థ మార్కెటింగ్ చేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. ఈ ట్యాబ్లెట్లకు లైసెన్స్ లేదని, అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నట్టు గుర్తించి స్టాక్‌ను సీజ్ చేశామని తెలిపారు. ఉప్పల్ మండలం న్యూ నాగోల్‌లో సంతోష్ అనే వ్యక్తి అనుమతి లేకుండా మందులను నిల్వ చేసిన గోదామును సీజ్ చేశామని చెప్పారు.