అంత్యక్రియలు చేయలేక ముక్కలు చేశారు!
వారిది నిరుపేద కుటుంబం. యాభై ఏండ్లు వచ్చినా ఎవరికీ పెండ్లికాని దైన్యం. అంతా మానసిక వ్యధతో కుమిలిపోయే స్థితి అంతలోనే అన్నకు అనారోగ్యం.. దవాఖానలో చనిపోయిన అన్న అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేని దుర్భర దారిద్య్రం.
- గోనెబస్తాలో మూటకట్టి రోడ్డుపై వదిలేసిన తమ్ముడు, చెల్లె
- 50 ఏండ్లు వచ్చినా ఎవరికీ పెండ్లికాలే
- మతిస్థిమితం లేక వింత నిర్ణయం
- బండ్లగూడలో హృదయ విదారక ఘటన
మెహిదీపట్నం, మే 12: వారిది నిరుపేద కుటుంబం. యాభై ఏండ్లు వచ్చినా ఎవరికీ పెండ్లికాని దైన్యం. అంతా మానసిక వ్యధతో కుమిలిపోయే స్థితి అంతలోనే అన్నకు అనారోగ్యం.. దవాఖానలో చనిపోయిన అన్న అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేని దుర్భర దారిద్య్రం. ఏం చేయాలో పాలుపోని సంకట పరిస్థితి.. చివరకు అన్న, చెల్లెలు కలిసి కఠిన నిర్ణయమే తీసుకున్నారు. అన్న మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోనెసంచిలో కట్టి రోడ్డుపై పడేశారు. చివరకు పోలీసులకు చిక్కారు. ముందుగా అంతా ఎవరినో హత్యచేసి పడేశారని అనుకున్నారు. కానీ, వారి దీనస్థితిని తెలుసుకొని కంటతడి పెట్టడం స్థానికుల వంతైంది. ఈ హృదయ విదారక ఘటన బండ్లగూడలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ ఎన్ఎఫ్సీ కాలనీలో నివాసముండే బాలమణికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో మొదటి కొడుకు విజయ్‌కుమార్ పోస్టాఫీస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కొడుకు అశోక్ (52), మూడో కుమారుడు రాజ్‌కుమార్ (45), కూతురు స్వరూపరాణి (38)లకు పెండ్లి కాలేదు. చిన్న కూతురు శోభారాణికి వివాహమైంది. ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్లో స్వీపర్‌గా పనిచేస్తున్నది. అశోక్, రాజ్‌కుమార్ మద్యానికి బానిసలుగా మారారు. వీరందరి మానసికస్థితి సరిగా ఉండదు. మూడు నెలలుగా అశోక్ ఆరోగ్యం బాగలేకపోవడంతో దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
అంత్యక్రియలకు డబ్బులు లేవని..
మానసికస్థితి సరిగా లేని వీరికి ఆదాయ వనరులు లేవు. చనిపోయిన అన్న మృతదేహానికి అంత్యక్రియలు చేయలేని పరిస్థితి తలెత్తింది. గురువారం రాత్రి సోదరి సహకారంతో అన్న మృతదేహాన్ని రాజ్‌కుమార్ ముక్కలుగా చేశాడు. వాటిని గోనెసంచిలో వేసి ఆటోట్రాలీ మాట్లాడుకొని లంగర్‌హౌస్ దర్గా సమీపంలో పడేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని గోనెసంచిని పరిశీలించగా అందులో మృతదేహం అవయవాలు కనిపించాయి. వీటిని పడేసిన రాజ్‌కుమార్, స్వరూపను లంగర్‌హౌస్ పోలీసులు పట్టుకొని విచారించగా, ఈ హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. మృతదేహం ముక్కలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

