డొమినిక: టీమ్ఇండియాతో ఈ నెల 12 నుంచి జరుగనున్న తొలి టెస్టు కోసం వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన టీమ్‌లో ఇద్దరు కొత్త ఆటగాళ్లు కిర్న్ మెకంజీ, అలిక్ అథనాజ్కు అవకాశం దక్కింది. ఆటతోనే కాకుండా తన ఆకారంతో అందరినీ ఆకర్శించిన రాకీమ్ కార్న్‌వాల్.. వెస్టిండీస్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతంలో తన బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో వేగ వంతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న కార్న్వాల్పై నమ్మకముంచిన సెలెక్టర్లు.. మరో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించారు. 2019లో భారత్ పైనే టెస్టు అరంగేట్రం చేసిన కార్న్‌వాల్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బ్రాత్‌వైట్ సారథ్యం వహించనున్న జట్టులో మాజీ స్టార్ శివ్‌నరైన్ చందర్‌పాల్ కుమారుడు త్యాగ్‌నరైన్ చందర్‌పాల్ చోటు దక్కించుకోగా.. బ్రాక్‌వుడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.