AICTE | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కోర్ ఇంజినీరింగ్ కోర్సులను బోధించే ఫ్యాకల్టీ ఎమర్జింగ్ కోర్సులను బోధించవచ్చా..? లేదా..? అన్న సందిగ్ధతకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఎట్టకేలకు తెరదించింది. సివిల్, మెకానికల్ వంటి కోర్ ఇంజినీరింగ్ కోర్సులను బోధించే ఫ్యాకల్టీ ఏఐఎంఎల్, ఐవోటీ, డాటాసైన్స్ వంటి ఎమర్జింగ్ కోర్సుల పాఠాలు కూడా బోధించవచ్చని స్పష్టంచేసింది. ఏఐసీటీఈ ఇటీవలే జేఎన్టీయూకు లేఖ రాసింది.
నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్హ్యాన్స్డ్ లెర్నింగ్(ఎన్పీటీఈఎల్) కోర్సులు పూర్తిచేసి 10 క్రెడిట్లు పొందినవారు.. లేదా ఏఐసీటీఈ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం పీజీ డిప్లొమా సర్టిఫికెట్ ఉన్నవారు కోర్ బ్రాంచి ఫ్యాకల్టీ ఎమర్జింగ్ కోర్సులను బోధించవచ్చని స్పష్టంచేసింది. ఏఐసీటీఈ నిర్ణయాన్ని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ స్వాగతించారు.