కరోనా లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికైనా జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందితే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మహబూబ్‌నగర్ : కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికైనా జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందితే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానను సందర్శించారు. కొవిడ్ పరీక్షలు నిర్వహించే విభాగాన్ని, ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించారు.
కొవిడ్ నుంచి కోలుకున్న రోగులతో మంత్రి మాట్లాడారు. చికిత్స ఎలా ఉందని ?డాక్టర్లు బాగా చూసుకున్నారా? భోజనం ఇతర వసతులు ఎలా ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏ జిల్లాలోని పేషెంట్లను ఆ జిల్లాలోనే చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో గత సంవత్సరమే సుమారు 300 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. వారం రోజుల్లో మరో 250 పడకల ను పూర్తి ఆక్సిజన్ తో సహా ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
జిల్లాలో మూడు సంచార అంబులెన్స్ క్లినిక్ లను కరోనా కోసం ఏర్పాటు చేశామన్నారు.
వాటి ద్వారా మందులను ఇంటికే పంపిస్తామన్నారు. భయపడకుండా ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా దవాఖానతో పాటు,ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లలో కూడా బెడ్లు ఇతర సౌకర్యాలున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
మంత్రి వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
వనపర్తి రోడ్డు ప్రమాదంలో మరొకరి మృతి
Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం కూతురు పోరాటం
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్
భారీగా నల్ల బెల్లం, పటిక పట్టివేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

