ఆదిలాబాద్ వైస్ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం
ఆదిలాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు జహీర్రంజానీపై బీఆర్ఎస్, బీజేపీతోపాటు సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
- పదవి కోల్పోయిన కాంగ్రెస్ వీసీ జహీర్‌రంజానీ
- అనుకూలంగా ఓటు వేసిన ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు
ఆదిలాబాద్, జూలై 18(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు జహీర్రంజానీపై బీఆర్ఎస్, బీజేపీతోపాటు సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి, ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్‌కుమార్ అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 34 మంది ఓటు వేయడంతో వైస్ చైర్మన్ జహీర్‌రంజానీ తన పదవిని వదుకోవాల్సిన పరిస్థితి నెలకున్నది.
కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు కౌన్సిలర్లతోపాటు 19 మంది బీఆర్ఆర్ కౌన్సిలర్లు, తొమ్మిది మంది బీజేపీ, ఒక ఎంఐఎం కౌన్సిలర్ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కాంగ్రెస్ వైస్ చైర్మన్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ కౌన్సిలర్లు ఓటు వేయడం చర్చనీయంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జహీర్‌రంజానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. సొంతపార్టీ నేతలు ఆయన రాకను వ్యతిరేకించారు. వైస్ చైర్మన్ పదవిని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసినా ఫలించలేదు. మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యాలయం ఎదుట సంబురాలు చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

