హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్లోకి చేరికలు ఊపందుకున్నాయి. నియోజకవర్గంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అలీ మస్కతి, టీడీపీ సీనియర్ మహిళా నేత షకీలా రెడ్డి బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే లక్ష్యంతోనే పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. మస్కతి, షకీలారెడ్డి చేరికతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు.
ఈ చేరికల సందర్భంగా కేటీఆర్‌తో మాజీ మంత్రులు మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, పార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, రాజీవ్ సాగర్, తుంగబాలు తదితరులు ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్లోకి ఊపందుకున్న చేరికలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలీ మస్కతి, టిడిపి సీనియర్ మహిళా నేత షకీలా రెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ గారుమాజీ… pic.twitter.com/KQBCA2meOw
— BRS Party (@BRSparty) October 14, 2025