CM Revant Reddy | వచ్చే ఏప్రిల్- మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం సన్నద్ధం అవుతున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా నియమించింది. రేవంత్ రెడ్డితోపాటు 25 మంది నేతలకు ఎన్నికల కమిటీలో చోటు కల్పించింది. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షులను ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించింది.
ఏఐసీసీ స్థాయిలో లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘సెంట్రల్ వార్ రూమ్’ ఏర్పాటు చేసినట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్‌గా ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్ పర్సన్, సోషల్ మీడియా విభాగం చైర్ పర్సన్ తదితరులు సభ్యులుగా ఉంటాయి.