BRS | నర్సాపూర్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి(Congress) భారీ షాక్ తగిలింది.
సిద్దిపేట : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి(Congress) భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరారు. స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అంజనేయులు (మాజీ జెట్పీ టీసీ), శరత్ చంద్ర, మల్లేశం, నర్సింహారెడ్డి, అరవింద్ బాబు ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..కాంగ్రెస్ అంటేనే నయవంచన అని, ప్రతి వర్గాన్ని మోసం చేసిన చరిత్ర ఆ పార్టీదని ఆరోపించారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క ప్రాంతం అభివృ ద్ధికి నోచుకోలేదని, ఏ ఒక్కరికీ మేలు జరగలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, నేడు కాంగ్రెస్ పాలనలో తిరోగమనంలో పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికేనని ఆరోపించారు.
కరెంటు నుంచి కాంటా దాకా..
వృద్ధులకు రూ.4000 పెన్షన్, మహిళలకు మహాలక్ష్మి పథకం, విద్యార్థులకు విద్యా భరోసా, నిరుద్యోగులకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలు.. ఇలా అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో కరెంటు నుంచి కాంటా దాకా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లోవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. కొనుగోలు కేంద్రాలు సక్రమంగా లేక, ధాన్యం దళారుల పాలవుతోందని మండిపడ్డారు.
రైతుబంధు, రుణమాఫీ, పంటల బీమా, బోనస్ వంటి పథకాలన్నీ అటకెక్కాయని విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసాలను ఎక్కడికక్కడ ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచిం చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండాయేనని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని హరీశ్ రావ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

