హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో వరద బాధితులకు సాయం అందించేందుకు వెళ్లిన ప్రతిపక్ష బృందంపై పోలీసుల అండతోనే కాంగ్రెస్ మూకలు దాడి చేశాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు బుధవారం డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీ మహేశ్ భగవత్‌కు మెమోరాండం సమర్పించారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. దాడులకు పాల్పడ్డ వారి పేర్లు సహా వివరాలు పోలీసులకు అందజేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని కోరామని తెలిపారు.