వెంగళరావునగర్, ఫిబ్రవరి 6 : అధికారం అండతో కాంగ్రెస్ నేతలు బరితెగించారు. అభివృద్ది కార్యక్రమా ల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆడబిడ్డపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ సహా కాంగ్రెస్ శ్రేణులు రౌడీల్లా విరుచుకుపడి బెదిరించడమే గాక బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి తెగబడ్డారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావునగర్‌లో జరిగిన కాంగ్రెస్ రౌడీయిజంపై బీఆర్ఎస్ మధురానగర్ మహిళా కార్పొరేటర్ దేదీప్యావిజయ్ మీడియా సమావేశం లో వివరాలు వెల్లడించారు. వెంగళరావునగర్ డివిజన్ జవహర్‌నగర్ మసీదుగడ్డ బస్తీలో సీవరేజీ పైపు లైన్ పనులు ప్రారంభించారు. కార్పొరేట ర్ ముందుగా పనులు ప్రారంభిస్తుందేమోనని భావించిన ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ శుక్రవారం తన అనుచరుల తో వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారు.
కొద్దిసేపటి తర్వాత కార్పొరేటర్ దేదీప్య అక్కడికి చేరుకుని కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించా రు. ఇది ఓర్వలేని ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ అనుచరులు రూప, సత్యం యాదవ్, గొంటి సాయియాదవ్ మ రికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా వారిపై దుర్భాషలాడుతూ దా డికి దిగారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇమ్రాన్, సత్యనారాయణ, బాలకృష్ణను వెంబడించి మరీ కొట్టారు. మధురానగర్ ఎస్సై శ్రీనివాస్ అక్కడే ఉన్నా దాడిని అడ్డుకోలేదు. కాంగ్రెస్ దాడులపై కార్పొరేటర్ దేదీప్య, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఇన్చార్జి మాగంటి సునీతతో కలిసి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.