వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 6: వరంగల్ నగరంలోని గోవిందరాజస్వామి ఆలయ ప్రధానార్చకుడిని కాంగ్రెస్ కార్పొరేటర్ అసభ్య పదజాలంతో దూషించాడు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సహిత గోవిందరాజస్వామి తిరుకళ్యాణోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకుంటున్న ఆలయ అనువంశీయ అర్చకుడు వరయోగుల శ్రీనివాసస్వామిని అడ్డుకుంటూ మరో అర్చకుడితో కల్యాణోత్సవాన్ని నిర్వహించాలని కార్పొరేటర్ అనిల్‌కుమార్ అదేశించాడు. శ్రీనివాసస్వామిని దూషిస్తూ ఆలయంలోకి రాకుండా చేస్తానంటూ బెదిరించాడు. ఆలయ అర్చకులు కలుగజేసుకొని తిరుకల్యాణోత్సవాన్ని కొనసాగించారు. ఆలయంలో రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నాయని అనంతరం అర్చకుడు శ్రీనివాసస్వామిని తెలిపారు.