దుబ్బాక, జూన్ 7: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదర్‌పల్లిలోని అసైన్డ్ భూముల ఆక్రమణలపై విచారణ జరపాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆయన దుబ్బాకలో ఓ ప్రకటన విడుదల చేశా రు.
చౌదర్పల్లిలో అసైన్డ్ భూముల ఆక్రమణలపై వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించిందని, దీనిపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఆ భూముల ఆక్రమణలు, క్రయవిక్రయాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి 15రోజుల్లో తమకు నివేదిక సమర్పించాలని సూచించారు. అసైన్డ్ భూములు పేదల బతుకుదెరువు కోసం మాత్రమే ప్రభుత్వాలు పంపిణీ చేశాయని తెలిపారు. సదరు భూములు పెద్దల చేతుల్లోకి పోవడం సరికాదని, ఆ భూములను తిరిగి స్వాధీనపరుచుకుని పేదలకు అందజేయాలని సూచించారు.