హెచ్‌సీఏలో 69 కోట్ల కుంభకోణం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో భారీగా అవినీతి జరిగిందని, మంత్రులు డాక్టర్ జీ వివేక్, మహ్మద్ అజారుద్దీన్ సహా పలువురు ప్రముఖులపై తెలంగాణ లోకాయుక్తలో అధికారికంగా ఫిర్యాదు నమోదైంది.
- మంత్రులు వివేక్, అజారుద్దీన్‌పై లో కాయుక్తలో ఫిర్యాదు
- సీఐడీ నుంచి నివేదిక కోరారు : ధరమ్ గురువారెడ్డి
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో భారీగా అవినీతి జరిగిందని, మంత్రులు డాక్టర్ జీ వివేక్, మహ్మద్ అజారుద్దీన్ సహా పలువురు ప్రముఖులపై తెలంగాణ లోకాయుక్తలో అధికారికంగా ఫిర్యాదు నమోదైంది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. మంత్రి వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌కు అనుకూలం గా రూ.69 కోట్ల పబ్లిక్ నిధులను అక్రమంగా మళ్లించారని ఆరోపించారు. హెచ్‌సీఏ నిధులను విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు అక్రమంగా కట్టబెట్టేందుకు షరతులతో కూడిన ఆర్బిట్రేషన్ నడిపించారని ఫిర్యాదులో పేరొన్నారు. గతంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్లుగా పనిచేసిన ప్ర స్తుత రాష్ట్ర మంత్రులు జీ వివేక్, అజారుద్దీన్ తమ పదవులను దుర్వినియోగం చేస్తూ.. విశా ఖ ఇండస్ట్రీస్‌కు లాభం చేకూర్చారని పిటిషనర్ విమర్శించారు. మంత్రి వివేక్ సోదరుడు జీ వినోద్‌కుమార్ కూడా గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఈ క్విడ్‌ప్రోకో ఒప్పందానికి బీజం పడిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 21 క్రికెట్ క్లబ్బుల్లో 18 క్లబ్బులను ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు రూ. కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకు అక్రమం గా విక్రయించారని, ఓటింగ్ హకులను దుర్వినియోగం చేశారని జీహెచ్ఎంసీ, ఏసీబీ, సీఐడీ రికార్డులను ఉటంకిస్తూ పేరొన్నారు.
లోకాయుక్త తక్షణం చర్యలు తీసుకోవాలి
తాను దాఖలు చేసిన ఫిర్యాదును స్వీకరిం చి, బాధ్యులైన అందరిపై తెలంగాణ లోకాయుక్త చట్టం-1983 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత హెచ్‌సీఏ అపె క్స్ కౌన్సిల్‌ను రద్దు చేసి, రిటైర్డ్ జడ్జి నేతృత్వం లో కమిటీని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో విశాఖ ఇండస్ట్రీస్, సీఐడీ అడిషనల్ డీజీ, సీఎస్, డీజీపీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, బీసీసీఐ సెక్రటరీలను కూడా రెస్పాండెంట్లుగా చేర్చారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పలు సీఐడీ ఎఫ్ఐఆర్లు, ఏసీబీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, లోకాయుక్త తక్షణమే స్పందించి తెలంగాణ క్రికెట్‌ను కాపాడాలని గురువారెడ్డి కోరారు. కాగా నాలుగు వారాల్లో సీఐడీ నివేదిక ఇవ్వాలని లోకాయుక్త కోరిందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

