పెద్దపల్లి కమాన్, జూ లై 29: జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుల పోటీ ల్లో సత్తా చాటి జిల్లా పే రుప్రఖ్యాతులు నిలిపిన విద్యార్థిని దాసరి హర్షితకు మరో అరుదైన అవకాశం లభించింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మం డలం చందనాపూర్ జ డ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న దాసరి హర్షితకు.. నవంబర్ 5 నుంచి 11 వరకు జపాన్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రదర్శనలో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని శనివారం జిల్లా విద్యాశాఖాధికారి డీ మాధవి తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు ఢిల్లీ వేదికగా నిర్వహించిన తొమ్మిదో జాతీయ ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శనలో జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో హర్షిత ఉత్తమ ప్రతిభ చాటి విజేతగా నిలిచింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్‌సింగ్ నుంచి అవార్డును అందుకున్నది. అలాగే గత ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ‘ఫైల్’ కార్యక్రమంలో పాల్గొని సత్తా చాటింది. డీఈవో, జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు, హెచ్ఎం శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.