హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని బీఎస్సీ డిగ్రీ కోర్సుకు కామన్ సిలబస్ రూపొందించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. శనివారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సైన్స్ కోర్సుల బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అన్ని వర్సిటీలకు ఒకే తరహా సిలబస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక బీఎస్సీ సైన్స్ కోర్సుల్లో 6 సెమిస్టర్లు ఉండగా, సెమిస్టర్‌కు 25 క్రెడిట్ల చొప్పన 150 క్రెడిట్లు ఉంటాయి. సెమినార్‌కు ఇది వరకు రెండు క్రెడిట్లు ఉండగా, తాజాగా ఒక క్రెడిట్‌కు పరిమితం చేశారు. ప్రాజెక్ట్/ఇంటర్న్‌షిప్‌కు ఇది వరకు నాలుగు క్రెడిట్లు ఉండగా, తాజాగా ఐదు క్రెడిట్లకు పెంచారు. ఈ కోర్సులలో 60 సీట్లకు పరిమితి విధించారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. అయితే బీఎస్సీ సైన్స్ బోర్డ్ ఆఫ్ స్టడీస్(బీవోఎస్) కమిటీలో ఇండస్ట్రీ, ఆర్అండ్డీ పరిశోధన సంస్థ, కాలేజీయేట్ కమిషనరేట్ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.
ప్రజాపాలన దరఖాస్తులపై ఇంటెలిజెన్స్ ఆరా
గంగాధర, ఫిబ్రవరి 15 : కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఓ జిరాక్స్ సెంటర్లో కాసారం గ్రామానికి చెందిన ప్రజాపాలన దరఖాస్తులు దర్శనమచ్చిన వార్త మూడు రోజుల క్రితం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ అధికారులు శనివారం ఆరా తీశారు. దరఖాస్తులు జిరాక్స్ సెంటర్లోకి ఎలా వచ్చాయి?, వాటిని ఎవరు తీసుకువచ్చారు? అన్న విషయాలపై జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు, రెవెన్యూ సిబ్బందిని విచారించినట్టు ఇంటెలిజెన్స్ అధికారి ప్రకాశ్ పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచే దరఖాస్తులు జిరాక్స్ సెంటర్‌కు తీసుకువచ్చినట్టు తెలిసిందని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయంలో మ్యాన్ పవర్ తక్కువగా ఉండడంలో జిరాక్స్ సెంటర్‌కు పంపించినట్టు రెవెన్యూ సిబ్బంది వివరించినట్టు పేర్కొన్నారు.